How to Check NEET UG 2025 Results NEET UG 2025 ఫలితాలు ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి. స్టెప్ బై స్టెప్ ప్రక్రియ, అధికారిక వెబ్‌సైట్ లింక్, స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్ వివరాలు ఈ గైడ్‌లో ఉన్నాయి.

Table of Contents
దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న NEET UG 2025 ఫలితాలు జూన్ 14, 2025న విడుదల కాబోతున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ పరీక్షను జూన్ 5వ తేదీన నిర్వహించింది. ఈ ఫలితాలను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ అయిన https://neet.nta.nic.in లో తనిఖీ చేసుకోవచ్చు. ఫలితాల విడుదల అనంతరం మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
NEET UG 2025 Results Highlights
ఫలితాల విడుదల తేదీ | జూన్ 14, 2025 |
అధికారిక వెబ్‌సైట్ | https://neet.nta.nic.in |
మొత్తం హాజరైన విద్యార్థుల సంఖ్య | 22 లక్షలకుపైగా |
ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులు | 70,000+ |
తెలంగాణలో విద్యార్థులు | 72,507 |
పరీక్ష తేదీ | జూన్ 5, 2025 |
ఫలితాల కోసం అవసరమయ్యే వివరాలు | రోల్ నెంబర్, పుట్టిన తేదీ |
How to check results? Step-by-step process
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://neet.nta.nic.in ఓపెన్ చేయండి.
- Home Pageలోని అయితే “NEET UG 2025 Result” అని ఉంటుంది దాని పై క్లిక్ చేయడం ద్వారా వేరే పేజీ కి వెళ్తుంది.
- మీరు నమోదు చేసిన రోల్ నెంబర్ మరియు పుట్టిన తేదీ నమోదు చేయండి.
- “Submit” బటన్ క్లిక్ చేస్తే స్కోర్ కార్డు స్క్రీన్ పై కనిపిస్తుంది.
- PDF రూపంలో డౌన్లోడ్ చేసి భద్రంగా ఉంచుకోండి.
స్కోర్ కార్డు లో ఏముంటుంది?
స్కోర్ కార్డ్ లో ఈ క్రింది సమాచారం ఉంటుంది:
- అభ్యర్థి పేరు
- రోల్ నెంబర్
- సబ్జెక్ట్ వారీగా పొందిన మార్కులు
- మొత్తం మార్కులు
- NEET UG కట్ ఆఫ్ స్కోర్
- అభ్యర్థి యొక్క All India Rank (AIR)
NEET UG 2025 Cutoff Marks (Expected)
Category | Expected Cutoff Marks |
General | 710 – 115 |
OBC | 110 – 95 |
SC | 100 – 80 |
ST | 95 – 75 |
గమనిక: ఇవి అంచనా కటాఫ్ మార్కులు మాత్రమే. అధికారిక కటాఫ్ మార్కులు ఫలితాల విడుదల అనంతరం వెల్లడవుతాయి.
How to Check NEET UG 2025 Results – కౌన్సిలింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది?
NEET UG 2025 ఫలితాల తర్వాత మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (MCC) ద్వారా కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేయబడుతుంది. ఈ కౌన్సిలింగ్ మూడు రౌండ్లలో జరగనుంది.
కౌన్సిలింగ్ భాగస్వామ్యం:
- 15% All India Quota (AIQ)
- 85% State Quota
కౌన్సిలింగ్ వెబ్‌సైట్: https://mcc.nic.in
ప్రతి విద్యార్థి యొక్క మెరిట్, కటాఫ్ మార్కులు మరియు ఇతర అర్హత ప్రమాణాల ఆధారంగా మెడికల్ మరియు డెంటల్ కాలేజీల్లో సీట్లు అలాట్ చేయబడతాయి.
విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- ఫలితాల విడుదలకు ముందు మీ రోల్ నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు సిద్ధంగా ఉంచుకోండి.
- ఫలితాలపై ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే NTA అధికారిక హెల్ప్‌లైన్ ద్వారా సంప్రదించండి.
- ఫలితాల డౌన్లోడ్ అనంతరం కౌన్సిలింగ్ కు అవసరమైన మొత్తం డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోండి:
- స్కోర్ కార్డు
- 10వ, 12వ క్లాస్ మార్కుల షీట్లు
- ఐడెంట్ ప్రూఫ్
- కేటగిరీ సర్టిఫికెట్ (అనువయించవలసిన వారికే)

Important links
- NEET UG 2025 ఫలితాల లింక్: https://neet.nta.nic.in
- NTA అధికారిక వెబ్సైట్: https://nta.ac.in
- MCC కౌన్సిలింగ్ వెబ్సైట్: https://mcc.nic.in
- ఇతర ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కోసం: FreshersJobDost.com
తదుపరి దశలు
ఫలితాల తర్వాత విద్యార్థులు తమ స్కోర్ ఆధారంగా మెడికల్, డెంటల్ సీట్ల కోసం కౌన్సిలింగ్ కోసం దరఖాస్తు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగే స్టేట్ కోటా కౌన్సిలింగ్ వివరాలు ఆయా రాష్ట్రాల డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయి.
సంక్షిప్తంగా చెప్పాలంటే
- NEET UG 2025 ఫలితాలు జూన్ 14న విడుదల
- అధికారిక వెబ్‌సైట్: neet.nta.nic.in
- ఫలితాల తర్వాత MCC ద్వారా కౌన్సిలింగ్
- రిజల్ట్ చెక్ చేసుకోవడానికి రోల్ నెంబర్, DOB అవసరం
- కటాఫ్ మార్కులు కేటగిరీల ఆధారంగా ఉంటాయి
- 22 లక్షల మంది ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు
NEET UG 2025 ఫలితాలపై మరింత సమాచారం : కౌన్సిలింగ్, మెరిట్ లిస్ట్, మరియు ఇతర అడ్మిషన్ ప్రక్రియ గురించి
ఫలితాల ప్రకటన అనంతరం, విద్యార్థులు మెరిట్ లిస్ట్ కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది. ఈ మెరిట్ లిస్ట్ ఆధారంగా AIQ కౌన్సిలింగ్ కు ఎంపిక చేసిన విద్యార్థుల పేర్లు NTA మరియు MCC వెబ్‌సైట్లలో ప్రచురించబడతాయి. మెరిట్ లిస్ట్ లో పేరు ఉన్న అభ్యర్థులు తాము కోరుకునే కాలేజీలకు వెబ్ ఆప్షన్ ఎంట్రీ చేయవచ్చు. AIIMS, JIPMER, AFMC లాంటి ప్రీమియర్ మెడికల్ ఇన్స్టిట్యూట్లలో అడ్మిషన్ కూడా NEET స్కోర్ ఆధారంగానే జరుగుతుంది.
కౌన్సిలింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి నమోదు ఫీజు, చైస్ ఫిల్లింగ్, సీటు అలాట్‌మెంట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి దశలు ఉంటాయి. ఈ దశల్లో ఏదైనా తప్పిదం జరగకూడదు, లేదంటే సీటు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
స్టేట్ లెవెల్ కౌన్సిలింగ్ కోసం విద్యార్థులు ఆయా రాష్ట్రాలవారు అయితే DME (Directorate of Medical Education) వెబ్‌సైట్లను కొన్ని సూచనలు ఖచ్చితంగా ఫాలో కావాల్సి ఉంటుంది . ప్రతి రాష్ట్రానికి కేటగిరీల ప్రకారం సీట్లు ఉంటాయి. 85% స్టేట్ కోటా కింద సీట్లకు ఆయా రాష్ట్రాలలో మాత్రమే అభ్యర్థులు అర్హులు.
కౌన్సిలింగ్ సమయంలో, విద్యార్థులు మరింత స్పష్టత కోసం రెగ్యులర్‌గా వెబ్‌సైట్లు, న్యూస్ పోర్టల్స్, మరియు అధికారిక నోటిఫికేషన్లు చెక్ చేస్తూ ఉండాలి. ఫేక్ లింక్స్‌కి దూరంగా ఉండటం, డాక్యుమెంట్లు జాగ్రత్తగా ఉంచుకోవడం, మరియు డెడ్‌లైన్స్‌ను తప్పక పాటించడం చాలా ముఖ్యం.
1. NEET UG 2025 ఫలితాలు ఎప్పుడు విడుదల అవుతాయి?
సమాధానం: NEET UG 2025 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)వారు జూన్ 14, 2025న విడుదల చేయనుంది సమాచారం .
2. ఫలితాలను చెక్ చేయడానికి ఏ వివరాలు అవసరం?
సమాధానం: విద్యార్థులు ఫలితాలను తనిఖీ చేయడానికి రోల్ నెంబర్ మరియు పుట్టిన తేదీ (Date of Birth) అవసరం.
3. NEET UG 2025 స్కోర్ కార్డు ఎక్కడ download చేసుకోవచ్చు?
సమాధానం: స్కోర్ కార్డు NTA అధికారిక వెబ్‌సైట్ https://neet.nta.nic.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
4. కౌన్సిలింగ్ ఎప్పుడు మొదలవుతుంది?
సమాధానం: ఫలితాల విడుదల అనంతరం, Medical Counselling Committee (MCC) జూలై ప్రారంభంలో కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. వెబ్‌సైట్: https://mcc.nic.in
5. ఫలితాల్లో ఎలాంటి లోపం ఉంటే ఏమి చేయాలి?
సమాధానం: మీ ఫలితాల్లో దోషాలు ఉంటే లేదా డేటాలో తప్పులు ఉంటే, వెంటనే NTA హెల్ప్‌డెస్క్ లేదా ఇమెయిల్ (nta@nic.in) ద్వారా సంప్రదించాలి.
Finally
ఇంకా NEET UG 2025 ఫలితాలపై ఎలాంటి తాజా సమాచారం వచ్చినా, అది వెంటనే మా FreshersJobDost వెబ్‌సైట్ ద్వారా అందిస్తాము . విద్యార్థులు తమ ఎగ్జామ్ హాల్ టికెట్ మరియు సంబంధిత వివరాలు సిద్ధంగా ఉంచుకుని ఫలితాల విడుదలను వెయిట్ చేయండి.
FreshersJobDost.com – మీ ఉద్యోగ కలలకి తొలి అడుగు
మరిన్ని ఇలాంటి ఉద్యోగ వివరాలు ఇలా కావాలి అంటే https://freshersjobdost.com/ ఇ వెబ్సైట్ ను సందర్శించండి