CSIR NET june 2025 notification జేఆర్‌ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం నిర్వహించే CSIR-UGC పరీక్షకు సంబంధించిన తాజా నోటిఫికేషన్ విడుదలైంది.

Table of Contents
CSIR NET జూన్ 2025 నోటిఫికేషన్ విడుదల – పూర్తి వివరాలు తెలుసుకోండి
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూన్ 2025లో నిర్వహించనున్న CSIR-UGC NET పరీక్షకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా అర్హత పొందిన అభ్యర్థులు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, లేదా పీఎచ్‌డీ అడ్మిషన్ కోసం అర్హత సాధించవచ్చు.
Important dates
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం | జూన్ 3, 2025 |
విద్యార్థులు | జూన్ 23, 2025 రాత్రి 11:59 వరకు తమ దరఖాస్తులను పూర్తి చేయాలి. |
ఫీజు చెల్లింపు చివరి తేదీ | జూన్ 24, 2025 |
దిద్దుబాటు తేదీలు | జూన్ 25–26, 2025 |
పరీక్షలు | జులై 26 నుంచి 28వ తేదీ వరకు, 2025లో మూడు రోజులు జరుగుతాయి. |
పరీక్ష విధానం | కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) |
పరీక్ష వ్యవధి | 3 గంటలు (180 నిమిషాలు) |
Exam Medium & Subjects
ఈ పరీక్ష పూర్తిగా Objective Type (Multiple Choice Questions) రూపంలో ఉంటుంది. అభ్యర్థులకు ఇంగ్లీష్ లేదా హిందీ భాషల్లో ప్రశ్నపత్రం అందుబాటులో ఉంటుంది.
పరీక్ష సబ్జెక్టులు:
- కెమికల్ సైన్సెస్
- లైఫ్ సైన్సెస్
- మ్యాథమెటికల్ సైన్సెస్
- ఫిజికల్ సైన్సెస్
- ఎర్త్, అట్మాస్ఫెరిక్, ఓషన్ & ప్లానటరీ సైన్సెస్
దరఖాస్తు విధానం
దరఖాస్తు చేయాలంటే https://csirnet.nta.ac.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే ఉపయోగించాలి. ఇతర మార్గాల్లో చేసిన అప్లికేషన్లు చెల్లవు.” ఒక్క అభ్యర్థి ఒక్క దరఖాస్తు మాత్రమే సమర్పించాలి. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు ఉంటే, అభ్యర్థిత్వం రద్దయ్యే అవకాశం ఉంటుంది.
దరఖాస్తుకు అవసరమయ్యే విషయాలు:
- చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ ఐడీ & ఫోన్ నంబర్
- ఫోటో & సిగ్నేచర్ స్కాన్ కాపీలు
- ఆన్‌లైన్ చెల్లింపుల కోసం డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా UPI
దరఖాస్తు ముందు ఇది చదవండి
- దరఖాస్తు చేసేముందు అర్హత ప్రమాణాలు, పరీక్ష విధానం, ఫీజు వివరాలు లాంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి Information Bulletin చదవాలి.
- అప్లికేషన్ సమయంలో ఇచ్చే మొబైల్ నంబర్, ఇమెయిల్ చిరునామాలు వ్యక్తిగతమైనవి కావాలి. కారణం, పరీక్షకు సంబంధించిన అప్డేట్స్ అన్ని వాటికే పంపబడతాయి.
For clarification of doubts
- ఎలాంటి సందేహాలు ఉన్నా, అభ్యర్థులు NTA హెల్ప్‌లైన్ నెంబర్లను సంప్రదించవచ్చు:
- 📞 011-40759000 / 011-69227700
📧 Email: csirnet@nta.ac.in
- 📞 011-40759000 / 011-69227700

Important links
- CSIR NET అప్లికేషన్ లింక్-Click Here
- NTA అధికారిక వెబ్‌సైట్-Click Here
- నోటిఫికేషన్ PDF: Careers సెక్షన్‌లో అందుబాటులో ఉంటుంది
- ఇతర ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కోసం: FreshersJobDost.com
Conclusion
CSIR NET june 2025 notification ద్వారా పరిశోధనలో కెరీర్ చేయాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. కావున అభ్యర్థులు పరీక్షకు సంబంధించి సమయానికి అప్లై చేసి, సద్వినియోగం చేసుకోవాలి.
ఇంకా హే ఇతర డౌట్స్ ఉన్న కామెంట్ చేయండి
ఈ అవకాశం మీకు లేదా మీకు తెలిసిన వారికైనా ఉపయోగపడేలా షేర్ చేయండి!
మీరు సాధించగలరన్న నమ్మకం తో ముందుకు సాగండి – మీ ఆత్మవిశ్వాసమే మీను గెలిపిస్తుంది.
మీ విజయానికి FreshersJobDost తరఫున శుభాకాంక్షలు!
Freshers Job Dost భారతదేశం లోని యువత కోసం రూపొందించబడిన ఓ విశ్వసనీయ ఉద్యోగ సమాచారం వేదిక. మీ కెరీర్ ప్రారంభానికి కావలసిన తాజా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ MNC ఉద్యోగాలు, వాక్-ఇన్ ఇంటర్వ్యూలు, ఇంటర్న్‌షిప్ అవకాశాలు, మరియు స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల సమాచారం ఇవ్వడం మా లక్ష్యం. 2024-25 బ్యాచ్ ఫ్రెషర్స్ కోసం ప్రత్యేక ఆఫర్లు, నోటిఫికేషన్‌లు, మరియు అప్లికేషన్ డెడ్‌లైన్‌లను డే టూ డే అప్‌డేట్ చేస్తాం. ప్రతి ఫ్రెషర్‌కు మొదటి ఉద్యోగం సాధించేందుకు మద్దతుగా మేమున్నాం.
FreshersJobDost.com – మీ ఉద్యోగ కలలకి తొలి అడుగు
మరిన్ని ఇలాంటి ఉద్యోగ వివరాలు ఇలా కావాలి అంటే https://freshersjobdost.com/ ఇ వెబ్సైట్ ను సందర్శించండి